శ్రీకాకుళం : నవంబర్ 21: నేటి రక్త దాతలే రేపటి ప్రాణ దాతలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అన్నారు. ఈ నెల 24 న యన్.సి.సి. దినోత్సవం సందర్భంగా గురువారం స్థానిక పురుషుల డిగ్రీ కళాశాలలో ఎన్ సిసి మరియు జిల్లా రెడ్ క్రాస్ సంస్థ సంయుక్తం గా ఏర్పాటు చేసి రక్త దాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యవంతులు ప్రతి మూడు నెలలకు రక్త దానం చేయవచ్చని, అపోహలు వద్దని ఆయన పిలుపునిచ్చారు. జిల్లాలో రక్త నిధి నిల్వలు చాలా తక్కువ గా ఉన్నాయని అన్నారు. సమయానికి రక్తం అందక చాలా మంది మరణిస్తున్నారని కాబట్టి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్త దానం చేయాలని అన్నారు. భవిష్యత్ తరాలకు మనం మార్గదర్శకం గా నివాలని తెలిపారు. శరీరానికి సంమృద్దిగా రక్త ప్రసరణ జరగడానికి బలమైన పోషక విలువ ఉన్న ఆహారాన్ని ప్రతి నిత్యం తీసుకోవాలని ముఖ్యం గా ఆకు కూరలు ఆహారంలో తీసుకుంటే చాలా మంచిదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా రక్త దానం చేసిన ఎన్ సిసి విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ పి. జగన్మోహన్ రావు, కళాశాల ఇన్ చార్జ్ ప్రిన్సిపాల్ లచ్చన్న, రెడ్ క్రాస్ ప్రతినిధులు పెంకి చైతన్య, డా. దానేటి శ్రీధర్, సెట్ శ్రీ సీఈఓ జి. శ్రీనివాస రావు, ఎన్ సిసి 14 వ ఆంధ్రా బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ జె.పి.పాండా, కెప్టెన్ మహేష్, పోలి నాయుడు, మేజర్ బాలకృష్ణ,లెఫ్ట్నెంట్ ముదీర్ షేక్, ఎన్ సిసి విద్యార్థులు పాల్గొన్నారు.
రక్తాన్ని దానం చేయండి ప్రాణాన్ని నిలబెట్టండి : శ్రీకాకుళం జిల్లా కలెక్టరు నివాస్