సంతకవిటి : నవంబరు 21 : స్వయం సహాయక సంఘాలకు "సున్న" వడ్డీ పథకంపై మహిళలుకు శిక్షణా కార్యక్రమం లో ముఖ్య అతిధిగా స్థానిక శాసన సబ్యులు కంబాల జోగులు హాజరైనారు.ఆయన ఈ సందర్భంలో మాట్లాడుతూ పల్లెల్లో ఉన్న సమస్యలను ఒక్కోక్కటి పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి గారు ఒక నవశకానికి నాంది పలుకుతూ సచివాలయాలను తీసుకొచ్చారన్నారు.ఈ సచివాలయాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించే కార్యక్రమం చేశారు.సచివాలయ వ్యవస్థ ద్వారా మేలైన సమాజం ఏర్పాటు అయ్యే విధంగా తొలి అడుగు పడింది.గ్రామంలో ప్రజలు ఏదైనా సమస్య పరిష్కరించుకునేందుకు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళాలిసిన పరిస్థితి ఇక అవసరంలేదు. ప్రజలకు అవసరమైన అన్ని వ్యవస్థలు సచివాలయంలో ఉండి మీ సమస్యలను సత్వర పరిష్కారానికి సచివాలయం ఎంతో ఉపయోగపడుతుంది. ప్రజలకు ఎక్కువగా భూసమస్యలు ఉన్న పరిస్థితి వాస్తవం అందుకే సర్వేయర్ మీకు అందుబాటులో ఉంటారు,అదే విధంగా అన్ని విభాగాల అధికారులు ఉంటారు.గత ప్రభుత్వాలు రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా మోసం చేశాయి.ఇక వాటికి శాస్వత పరిష్కారం చూపే ఉద్దేశంతో వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ కన్నా మిన్నగా రైతులకు చేస్తున్నారు.ఆయన పాదయాత్రలోనేను విన్నాను! నేను ఉన్నాను అనే మాటపై ఇచ్చిన హామీలన్ని నెరవేర్చుతున్నారు.అమ్మ ఒడి, మహిళలకు రుణమాఫీ, అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు అన్నీ ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు.ప్రతి గ్రామాల్లో అన్ని మౌలిక సదుపాయాల కల్పిస్తాము.మీలో ఒక వ్యక్తిగా, మీ అన్నదమ్ముడిగా ఎమ్మెల్యే ఉన్నారు అనే విధంగా నేను అనునిత్యం ఉంటాను.పార్టీ కోసం అలాగే ప్రజల కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తను నా భుజాలపై మోస్తాను.అని స్థానిక శాసన సభ్యులు కంబాల జోగులు అన్నారు.ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు సంతకవిటి మండల నాయకులు సిరిపురపు జగన్మోహన రావు, గురుగుబెల్లి స్వామినాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు కార్యకర్తలు పాత్రికేయులు సోషల్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
నవశకం ప్రారంభం : యమ్.యల్.ఎ. జోగులు